
వికారాబాద్, వెలుగు: తాండూరులో ఈ నెల 29న జరిగే మెగా జాబ్‌మేళాకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 52 పారిశ్రామిక రంగాల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ లోని వినాయక కన్వెన్షన్ లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ సుధీర్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్, జేడీఎం సతీశ్, తాండూర్ సీడీపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు.