వికారాబాద్ లో నేడు మెగా జాబ్ మేళా

వికారాబాద్ లో నేడు మెగా జాబ్ మేళా

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టౌన్​లోని నర్సింగ్ ఫంక్షన్ హాల్​లో జాబ్​మేళా ఉంటుందన్నారు.

60కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని, 5 వేల మందిని తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలోని నిరుద్యోగలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.