కూకట్పల్లి JNTU యూనివర్సిటీలో మెగా జాబ్మేళా

కూకట్పల్లి JNTU యూనివర్సిటీలో మెగా జాబ్మేళా

నిరుద్యోగులకు శుభావార్త..ఉద్యోగ కల్పనే లక్ష్యంగా హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. డిసెంబర్ 16 న నిర్వహించే జాబ్ మేళా వివరాలను వివరించారు కట్టా నరసింహారెడ్డి. సేవా ఇంటర్నేషనల్, నిపుణ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉచి రిజిస్ట్రేషన్ తో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రెండేళ్లలో ఐదు సార్లు జాబ్ మేళా నిర్వహించి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. డిసెంబర్ 16 కూడా ఇంటర్వ్యూలు నిర్వహించిన 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగాల కల్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు వైస్ఛాన్స్ లర్ నరసింహారెడ్డి