అక్టోబర్ 26న బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా

అక్టోబర్ 26న బెల్లంపల్లిలో  మెగా జాబ్ మేళా

హైదరాబాద్, వెలుగు: సింగరేణి చేపట్టిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. ఈ నెల 26న బెల్లంపల్లిలో జరగనున్న జాబ్ మేళాలో 80కి పైగా ప్రైవేటు కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయని చెప్పారు.

 గురువారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్​లతో  కలిసి గడ్డం వినోద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. పోస్టర్‌‌లోని క్యూఆర్ కోడ్‌‌ను స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు.