గౌతంరాజు కుటుంబాానికి చిరంజీవి సంతాపం

గౌతంరాజు కుటుంబాానికి చిరంజీవి సంతాపం

సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రాజు గొప్ప ఎడిటర్ అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాంటి గొప్ప ఎడిటర్ ను కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. ఆయన ఎంత సౌమ్యుడో..వారి ఎడిటింగ్ అంత వాడిగా ఉందున్నారు. నా చట్టానికి కళ్లు లేవు నుంచి ఖైదీ నెం.150 వరకు ఎన్నో చిత్రాలకు గౌతమ్ రాజు వర్క్ చేశారని చిరంజీవి తెలిపారు. గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా తనకూ, చిత్ర పరిశ్రమ కు తీరని లోటన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని చిరంజీవి తెలియజేశారు.


 
సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

గౌతమ్ రాజు 800కిపైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్‌, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ సినిమాలకు ఎడిటింగ్ నిర్వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు.