మెగాస్టార్ గాడ్ఫాదర్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ గాడ్ఫాదర్ ట్రైలర్ రిలీజ్

చిరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ఫాదర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి డైలాగ్స్, యాక్షన్, థమన్ బీజీఎం హైలెట్ గా నిలిచాయి. రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ నా నుంచి రాజకీయం దూరంగా లేదు, నేనుంత వరకు ఈ కుర్చీకి చెదపట్టనివ్వను అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్తో ఈలలు వేయిస్తున్నాయి. 

ఈ మూవీలో చిరు న్యూలుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మలయాళ మూవీ లూసీఫర్కు రీమేక్ గా గాడ్ఫాదర్ ను తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ సముద్రఖని, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.