గొడ్డులా కష్టపడతా..గెట్ లాస్ట్ : చిరంజీవి

గొడ్డులా కష్టపడతా..గెట్ లాస్ట్ : చిరంజీవి

స్టార్ డమ్ ఊరికే రాదని.. కష్టపడితేనే వస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను  గొడ్డులా కష్టపడతానని.. కష్టపడి పనిచేస్తున్నప్పుడు తనకు ఎటువంటి బాధ ఉండదన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రెస్మీట్లో రిపోర్టర్ల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. మెగాస్టార్ స్థాయికి ఎదిగిన మీరు.. నీటిలో తడుస్తూ ఫైట్లు చేయాలా? మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నటించాలా? ఆ అవసరం ఉందా అనే ప్రశ్నకు చిరంజీవి ఘాటుగా స్పందించారు. ‘‘ఆ అవసరం లేదు అనిపించిన రోజున రిటైర్డ్ అయిపోవడమే ఉత్తమం. ఇది నేను ప్రతి ఒక్కరికీ చెబుతా. మనం దేనికైనా కమిట్ అయినప్పుడు.. దానికి న్యాయం చేయాలి. బిగినింగ్ డేస్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఈ ప్రశ్న ఎదురైతే.. స్టార్ డమ్ మామూలుగా రాదు.. కష్టపడితేనే వస్తుందని సమాధానం చెప్పేవాడిని’’ అని అన్నారు.

సింపతి చూపడం తనకు నచ్చదని చిరు అన్నారు. ‘‘ఇప్పటికే అదే చెబుతా. ఇప్పుడు నేను కమిట్మెంట్‌తో చేస్తున్నప్పుడు అయ్యో పాపం అని సింపతీ చూపితే నచ్చదు. ఎప్పుడూ ఆకలితో ఉండాలి. ఆకలి చచ్చిపోయిన రోజున ఇండస్ట్రీని వదిలేయాలి. నేను కేవలం షర్ట్ వేసుకుని మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో నటించాను. ఐస్ షూస్ లోపలికి వెళ్లి కాళ్లు కమిలిపోయాయి. కానీ, ఆ బాధను వ్యక్తపరచలేను. గొడ్డులా కష్టపడతా. నేను కష్టపడి పనిచేస్తున్నప్పుడు నాకు బాధ ఉండదు. ఎందుకంటే.. ఆ సమయంలో నాకు అభిమానులు వావ్ అని అనడం నా కళ్లల్లో కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది’’ అని చిరంజీవి అన్నారు. 

గ్యాంగ్ లీడర్ రేంజ్లో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిండు

శేఖర్ మాస్టర్ డ్యాన్స్ సూపర్బ్గా కంపోజ్ చేశారని చిరంజీవి అన్నారు. ఆరేడు రోజుల్లోనే 2 సాంగ్స్ కంప్లీట్ చేశామని చెప్పారు.  గ్యాంగ్ లీడర్ సినిమా రోజులు గుర్తుకొచ్చాయన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ కష్టపడి చేశాడని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు వారి బాధ్యతలను ప్రేమతో నిర్వర్తించారని చిరంజీవి అన్నారు. అందరు ప్రేమించిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని స్పష్టం చేశారు.