TeluguDMF: డిజిటల్ యుగంలో కొత్త శకం ప్రారంభం.. కంటెంట్ క్రియేటర్స్ అంతా ఒకే చోట!

TeluguDMF: డిజిటల్ యుగంలో కొత్త శకం ప్రారంభం.. కంటెంట్ క్రియేటర్స్ అంతా ఒకే చోట!

మీడియా..కంటికి కనిపించని ఎన్నో విషయాలను వెలికితీసేందుకు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటోంది. ఇందుకోసం ఆ వెలికితీసిన విషయాలను జనం భాషలో అర్ధమయ్యేలా  తమ మాటలను వినిపిస్తోంది..తమ రాతలను చూపిస్తోంది.

అందుకోసం వెబ్‌ సైట్ కంటెంట్ రైటర్స్, మీడియా మెంబర్స్, కెమెరామెన్స్..ఇలా మీడియా విభాగంలోని ప్రతి జర్నలిస్టు రోజూ తమ విధులను నిర్వర్తిస్తుంటారు. కానీ,అందరూ వెలుగులోకి రాలేరు.నిజం చెప్పాలంటే అందరూ గుర్తించబడలేరు.కానీ ప్రతిఒక్కరూ తమ క్రియేటివిటీని ఎప్పటికప్పుడు ప్రజల వరకు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకుంటారు.

అయితే, ఇప్పుడు ప్రపంచంలోని తెలుగు క్రియేటర్స్ ఎక్కడున్నా..అందరు ఒకచోట భాగం అవ్వుటకు శ్రీకారం చుట్టారు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఒక మైల్‌స్టోన్ మూమెంట్ కు శ్రీకారం చుట్టారు తెలుగు డిజిటల్ మీడియా క్రియేటర్స్. ఈ మేరకు "తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్"(Telugu Digital Media Federation)' ఏర్పడింది. అయితే దీన్ని ముఖ్యోద్దేశ్యం ఏంటంటే..ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో తెలుగు కంటెంట్ సృష్టికర్తలను ఏకం చేయడమే కోసం తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ గొప్ప నిర్ణయం తీసుకుంది. తెలుగుడీఎంఎఫ్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రారంభమయింది.

తెలుగుడీఎంఎఫ్ (TeluguDMF) అఫీషియల్ వెబ్ సైట్ www.telugudmf.comను(2024 మార్చి 11న) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ప్రారంభించారు. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫెడరేషన్ లోగోతోపాటు వెలకమ్ పోస్టర్ ను రివీల్ చేశారు.డిజిటల్ యుగంలో మరో కొత్త శకం ఆవిష్కృతం అయిందంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ క్రియేటర్స్ ను ఒక వేదికపై ఏకం చేసేందుకు ఫెడరేషన్ రూపంలో తీసుకున్న చొరవను మెగాస్టార్ చిరు ప్రశంసించారు. "వెబ్‌ సైట్ కంటెంట్ రైటర్‌లు, ఇన్‌ స్టాగ్రామ్ ఇన్‌ ఫ్లుయెన్సర్‌లు, ట్విట్టర్ పర్సనాలిటీలు, మీమ్ క్రియేటర్లు తదితర విభిన్న కంటెంట్ క్రియేటర్స్ ను ఏకం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. వారికి మార్గదర్శకత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, కొలాబరేటివ్ పార్టనర్ షిప్స్ కోసం ఫెడరేషన్ ప్రారంభించడం నిజంగా ప్రశంసనీయం" అంటూ చిరంజీవి కొనియాడారు.

Also Read :అయోధ్యలో అపోలో సేవలు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉపాసన భేటీ

తెలుగుడీఎంఎఫ్ ఫౌండర్లు మాట్లాడుతూ.."TeluguDMF కేవలం ఒక సమాఖ్యగా కాదు. అంత కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. ఓ శక్తివంతమైన అసలుసిసలైన వ్యవస్థగా నిలుస్తుంది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ ని కలుస్తోంది.తెలుగు డిజిటల్ కంటెంట్‌ ను అపూర్వమైన గుర్తింపుతో సమిష్టిగా ముందుకు నడిపిస్తాయి" అని తెలిపారు. అయితే, ఈ సంచలనాత్మక చొరవలో ప్రతిఒక్కరు ఏకధాటిగా భాగస్వాములు కావాలని తెలుగుడీఎంఎఫ్..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లందరినీ ఆహ్వానించింది.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ.."తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్" యొక్క మైల్‌స్టోన్ మూమెంట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోని తెలుగు కంటెంట్ సృష్టికర్తలను ఏకం చేద్దాం..ఈ గ్రౌండ్ బ్రేకింగ్ చొరవ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెల్లడించారు. 

ఇందుకోసం ఫెడరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం hello@telugudmf.com వెబ్ సైట్ ను సంప్రదించమని కోరింది. తమ క్రియేటివేటీని ఎప్పటికప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా చాటాలని తెలిపింది.