
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. అడవి శేషు ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న రిలీజైన మేజర్ చిత్రం..బ్లక్ బస్టర్గా నిలిచింది. దేశ వ్యాప్తంగా ప్రముఖులు మేజర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం మేజర్ను మెచ్చుకున్నారు. మేజర్ను వీక్షించిన చిరంజీవి..ఇలాంటి గొప్ప చిత్రాన్ని అందరూ చూడాలన్నారు. మేజర్ టీమ్తో లంచ్ చేసిన చిరంజీవి..వారిని అభినందించారు. మేజర్ అనేది ఒక సినిమా కాదని..అదొక నిజమైన ఎమోషన్ ..నిజమైన హీరో కథ అని చెప్పారు. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథను డైరెక్టర్ శశికిరణ్ తిక్క అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన మహేష్ బాబును చూస్తే గర్వంగా ఉందన్నారు. మేజర్ టీమ్తో మీట్ అయిన ఫోటోలను చిరంజీవి ట్వీట్ చేశారు. మేజర్గా నటించిన అడవి శేషు, మేజర్ చిత్ర యూనిట్కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
#Major is not a film.Its truly an Emotion
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022
Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch
Proud of @urstrulyMahesh for backing such a purposeful film
HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO
థ్యాంక్యూ సర్ అంటూ చిరు ట్వీట్కు మహేష్ బాబు రిప్లై ఇచ్చాడు. మీ ప్రశంసలతో మేజర్ టీం ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
Thank you @KChiruTweets sir! ? Team #Major is over the moon!! ??? https://t.co/KVCYvkRTDP
— Mahesh Babu (@urstrulyMahesh) June 13, 2022
చిరంజీవితో లంచ్ చేసిన అడవి శేషు..తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. చిరు సర్ తో లంచ్ చేయడం పెద్ద గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. మీరు గంటల పాటు సినిమా గురించి మాట్లాడటం..అద్భుమైన భోజనాన్ని పెట్టడం..సినిమా ఎందుకు నచ్చిందో వివరించడం ఆనందంగా ఉందన్నాడు. మెగాస్టార్ గా మీరంటే ఇన్నాళ్లు ఇష్టపడ్డానని..అయితే ఇవాళ మాత్రం మీలోని గోల్డెన్ హార్ట్ ను చూశానని అడవి శేషు ట్వీట్ చేశాడు.
Today feels like my highest honour Sir! @KChiruTweets You spoke to us for hours. Fed us an amazing lunch. And explained what you loved about the film. Such attention to detail, such insightful questions. I always loved #Megastar the hero. Today, I witnessed your heart of gold.❤️ https://t.co/6QZ9rNbusp
— Adivi Sesh (@AdiviSesh) June 13, 2022