Chiranjeevi: మా ఆస్కారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెగాస్టార్ స్పెషల్ వీడియో

Chiranjeevi: మా ఆస్కారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెగాస్టార్ స్పెషల్ వీడియో

నేడు(జులై 4) టాలీవుడ్ ప్రముఖ సంగీతం దర్శకుడు ఎంఎం కీరవాణి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా ఆస్కారుడు ఎంఎం కీరవాణికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. 

ఇక షేర్ చేసిన వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇలా అందరు కలిసి సంగీత దర్శకుడి వద్ద కూర్చొని పాటల కంపోసింగ్ చేశేవారు. అలా అందరు ఆమోదించిన తరువాతే ఆ పాట బయటకు వచ్చేది. మరుగునపడిన ఆ సంప్రదాయాన్ని మళ్ళీ మా సినిమాతో ముందుకు తీసుకువస్తున్నాము. అది చూస్తుంటే ఎంఎం కీరవాణితో నేను చేసిన ఆపద్భాందవుడు సినిమా రోజులు గుర్తొచ్చాయి. ఆ క్షణాలను మీతో పంచుకోవాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. 

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో, పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా తీసిన వీడియోను ఇప్పుడు షేర్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.