V6 News

హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ అన్నారు: చిరంజీవి

హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ అన్నారు: చిరంజీవి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు దన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారని.. ఈ దిగ్గజాల మధ్య తాను ఉండటం నిజంగా ఓ గౌరవమని అన్నారు చిరంజీవి. ఇది చిరంజీవికి వచ్చిన ఆహ్వానం కాదని.. సినీ ఇండస్ట్రీ తరపున తనకు వచ్చిన ఆహ్వానమని అన్నారు చిరంజీవి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు కలిసిన సందర్భంలో హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం హబ్ గా మార్చాలని అన్నారని గుర్తు చేశారు చిరంజీవి.

ఇతర భాషల వాళ్ళు కూడా హైదరాబాద్ కు వచ్చి షూటింగ్ లు చేసుకోవాలని సీఎం రేవంత్ చెబుతూ వస్తున్నారని అన్నారు చిరంజీవి. సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ పూర్తి సహకారం అందిస్తున్నారని.. త్వరలోనే ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ సినిహబ్ గా మార్చే ప్రయత్నం చేస్తామని అన్నారు చిరంజీవి.

ALSO READ : Telangana Global Summit : తెలంగాణలో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు

ఈ సభకు తనను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రికి శ్రీధర్ బాబు వచ్చినపుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నానని అన్నారు. అప్పుడు షూటింగ్ ఆపేసి వారితో మాట్లాడానని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.