Chiranjeevi SSC Certificate: చిరంజీవి టెన్త్‌ సర్టిఫికెట్‌ వైరల్‌..అలా ఎలా బయటికి వచ్చింది?

Chiranjeevi SSC Certificate: చిరంజీవి టెన్త్‌ సర్టిఫికెట్‌  వైరల్‌..అలా ఎలా బయటికి వచ్చింది?

తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో..ఎక్కడో మొగల్తూరు అనే చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఇండస్ట్రీలో మెగాస్టార్ బిరుదును సొంతం చేసుకున్న వ్యక్తి చిరంజీవి(Chiranjeevi).

జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు దాసుడినని ఎన్నోసార్లు పలు స్టేజీలపైనా చెప్పుకొచ్చారు చిరు. ఇలాంటి స్థాయి..స్థానం సొంతం చేసుకున్న చిరంజీవి గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చిన..క్షణాల్లో వైరల్ అవ్వడం ఎంతో కామన్ . సినిమాల అప్డేట్స్ కానీ,ఇక ఏ ఇతర కార్యక్రమాల్లో అయిన ఆయన మాట్లాడిన మాటలు ఇట్టే వైరల్ అవుతుంటాయి.

లేటెస్ట్ గా చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతుంది.చిరు తన 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ కారణంగా ఇవాళ వార్తల్లో నిలిచారు. ఆ సర్టిఫికెట్ ఎలా బయటకు వచ్చిందో..ఏ విధంగా బయటకు వచ్చిందో..తెలియదు కానీ చిరంజీవి యొక్క 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ సర్టిఫికెట్‌ లో ఉన్న వివరాలు చూసుకుంటే..వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన చిరు అసలు  పేరుతో ఈ సర్టిఫికెట్ ఉంది.ఈ సర్టిఫికెట్‌ లో చిరంజీవి పూర్తి పేరును కేఎస్‌ఎస్‌ వర ప్రసాద్‌ అని(కొణిదెల శివశంకర వరప్రసాద్), తండ్రి పేరు వెంకట్‌ రావు అని ఉంది.అందులోని పాఠశాల వివరాలు మొగల్తూరుకు సంబంధించినవిగా ఉన్నాయి.అంతే కాకుండా చిరంజీవి పెనుగొండలో పుట్టినట్లుగా కూడా సర్టిఫికెట్ లో ఉంది.

చిరు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగిన విషయం తెలిసిందే.

ALSO READ :- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు

ఇక  10వ తరగతి స్టడీ సర్టిఫికెట్‌ ఎలా బయటకి వచ్చిందో..అసలు ఈ సర్టిఫికెట్‌ చిరంజీవిదేనా ? లేక ఎవరైనా క్రియేట్ చేశారా? అనే సందేహాల పైనా చిరంజీవి స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. అయితే,ఈ విషయమై ఆయన స్పందించక పోవచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.