చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం

చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం

చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు మెగస్టార్ చిరంజీవి. శబరికి వెళ్లిన ఫోటోలను చిరంజీవి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా  అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా  డోలీలో వెళ్లవలసి వచ్చిందన్నారు. ఆస్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న ఆ శ్రమైక సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. డోలీ మోసిన వారికి చిరంజీవి చేతులెత్తి నమస్కరించారు. ఇవాళ ఉదయం గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు.