
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(Kalvakuntla Tarakarama rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన విజన్ తో తెలంగాణాను ఐటీ రంగంలో అభివృద్ధి పదం వైపు దూసుకెళ్లేలా చేస్తున్నారు. ఇక జులై 24 ఆయన పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “మై డియర్ బ్రదర్ తారక్.. నువ్వొక డైనమిక్ లీడర్ వి. అంతేకాదు గొప్ప స్నేహితుడివి కూడా. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటాం, అలాగే నీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాం. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి.. హ్యాపీ బర్త్ డే” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
My dear brother Tarak @KTRBRS ,
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2023
You are a dynamic leader and a friend we all truly love & admire.
Wishing you joy, and dreams that always inspire. May your journey be blessed, with each stride you make.
HAPPY BIRTHDAY! ??
God bless !