మెగా మూవీ ఆరంభం

V6 Velugu Posted on Aug 13, 2021

‘ఆచార్య’ సినిమా పూర్తవకముందే తన కొత్త సినిమాని సెట్స్‌ పైకి తెచ్చారు మెగాస్టార్. మోహన్‌ రాజా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇవాళ ప్రారంభమవుతోంది. మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో మెప్పించిన ‘లూసిఫర్‌‌’కి ఇది రీమేక్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఓ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిన్న అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అందులోనే షూటింగ్ జరగబోతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌‌ గుడ్‌ ఫిల్మ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Tagged Movies, acharya, Chiranjeevi, tollywood, Megastar, lucifer, Mohanlal, , God father

Latest Videos

Subscribe Now

More News