- మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ డ్రెస్‌తో తళుక్కు
- డ్రెస్ తయారీకి 3,400 గంటలు శ్రమించిన 90 మంది కళాకారులు
- చేతి వేళ్లకు కోట్ల విలువైన 30, 23 క్యారెట్ల రెండు డైమండ్ రింగ్స్
హైదరాబాద్, వెలుగు: ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాకెక్కిన ‘మేఘా కృష్ణారెడ్డి’ భార్య మేఘా సుధారెడ్డి మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ‘2026 మెట్ గాలా’లో
మెరిశారు. రూ.142 కోట్ల విలువైన ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు. ఆమె చేతి వేళ్లకు పెట్టుకున్న కోట్లాది రూపాయల విలువజేసే రెండు వజ్రపుటుంగరాలు కూడా ఆకట్టుకున్నాయి. 90 మందికి పైగా హస్తకళాకారులు 3,400 గంటలపాటు కష్టపడి రూపొందించిన డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై సుధారెడ్డి వాక్చేశారు.
ఎంతో విలువైన నగలు, డ్రెస్ తో పాల్గొన్న ఆమె ఈ ఈవెంట్లోనే చర్చనీయాంశమయ్యారు. ఈ సారి మెట్గాలాను ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ అనే డ్రెస్ కోడ్‌తో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుధారెడ్డి ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ డ్రెస్‌తో రెడ్ కార్పెట్‌పై వాక్ చేశారు. ఆమె మెట్ గాలాకు హాజరవ్వడం ఇది మూడోసారి. దక్షిణ భారతదేశంలోని కళంకారీ హస్తకళ ఆధారంగా రూపొందించిన ఈ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
మచిలీపట్నం శైలిలో సహజ రంగులు వాడి పూర్తి చేతితో వేసిన డిజన్‌తో తయారు చేశారు. తెలంగా ణకు చెందిన పాలపిట్ట, జమ్మి చెట్టు, తంగేడు పువ్వు వంటి చిహ్నాలు డ్రెస్‌పై పొందుపరిచారు. ఆమె ధరించిన ఈ డ్రెస్‌ను 90 మందికి పైగా హస్తకళాకారులు 3,400 గంటలకు పైగా కష్టప డి తయారు చేశారు. సుధారెడ్డి ధరించిన నెక్లెస్ ఈ ఈవెంట్‌లో అత్యంత చర్చనీయాంశమైంది. దాదాపు వంద కోట్లకు పైగా విలువైన ఈ నెక్లెస్‌లో టాంజానియాలోని మెరెలాని పర్వాతాల నుంచి సేకరించిన 550 క్యారెట్ల ‘క్వీన్ ఆఫ్ మెరెలాని’ అనే ముదురు వాయ్‌లెట్-నీలం రంగు టాంజనైట్ డైమండ్‌ను అమర్చారు.
దాని చుట్టూ త్రిభుజాకా ర, పియర్ షేప్ రోజ్-కట్ వజ్రాలను అందమైన పూల గుత్తులుగా అలంకరించారు. అలాగే, ఆమె 23 క్యారెట్ల పసుపు రంగు డైమండ్ ఉంగరం, రాజస్థాన్‌కు చెందిన 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ ఉంగరం కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. “హైదరాబాద్ నా బేస్. అక్కడి కల్చర్ నేనెవరో చెప్పే ఫౌండేషన్ లాంటిది. నేను ధరించిన డ్రెస్ ఆ కల్చర్‌ను సింపు ల్గా గ్లోబల్స్టైల్లో చూపించే ప్రయత్నం. ఇది నాకు చాలా పర్సనల్ కూడా. భారతీయ కళానైపు ణ్యం అనేది ఒకప్పుడు మాత్రమే ఉండేదనేది నిజం కాదు.. ఇప్పటికీ సజీవంగా ఉన్న కళ” అని అన్నారు.
