
నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మిస్తున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. రాధిక శరత్‌కుమార్, సుమన్, తనికెళ్ల భరణి, ఆమని, తులసి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 22న సినిమా రిలీజ్. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘ఇదొక బ్యూటీఫుల్ క్లీన్ మూవీ.
ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుంది’ అని చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని హీరోయిన్ రబియా ఖతూన్ చెప్పింది. ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని దర్శకుడు విపిన్ అన్నాడు. చక్కని ఎమోషన్స్ ఉన్న క్లీన్ ఫ్యామిలీ సినిమా ఇదని నిర్మాత ఉమాదేవి చెప్పారు. నటుడు రాజా సహా టీమ్ అంతా పాల్గొన్నారు.