మెహుల్ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా

మెహుల్ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా

పారిపోయిన వజ్రవ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా దేశ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మెహుల్ బెయిల్ పిటిషన్ పై జూన్ 11న కోర్టులో విచారణ జరిగింది. జరిమానా కట్టి బెయిల్ పొందగలిగే వీలున్న నేరమే చేశారని... మెహుల్ తరఫున లాయర్ వాదించారు. క్యాష్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. తమ క్లయింట్ ఆరోగ్యం బాగాలేదని.. ఆయన ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదని కోర్టుకు చెప్పారు. ఐతే... మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ అయిందని ఆ దేశం తరఫు లాయర్.. కోర్టుకు తెలిపారు. బెయిల్ ఇస్తే... మళ్లీ పారిపోయే సూచనలు ఉన్నాయన్నారు. దీంతో.. మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది డొమినికా కోర్టు. రోజో కోర్టులో బెయిల్ రాకపోవడంతో.. మెహుల్ హైకోర్టుకు వెళ్లాడు. ఇల్లీగల్ గా వచ్చాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ ను.. నిషేధిక వలసదారుగా ప్రకటించింది డొమినికా ఐలండ్ ప్రభుత్వం.