
- ఇయ్యాల గాంధీభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాద్‌కు వచ్చారు. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఏఐసీసీ కార్యరద్శి నదీమ్‌జావెద్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. శుక్రవారం గాంధీ భవన్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మీరాకుమార్ పాల్గొంటారు. ఉదయం 10.30కు జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు ప్రారంభిస్తారు. 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి, అక్కడి నుంచి నిజాం కాలేజీ దగ్గర్లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. తర్వాత గాంధీభవన్‌కు పాదయాత్రగా వెళ్లి బహిరంగ సభలో మాట్లాడతారు. వేడుకల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు పాల్గొంటారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
అమెరికాకు రేవంత్..
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడి జాన్కెన్నడీ విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు.