
కరోనా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా నిరూపించుకున్నారు. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ చాలా మంది ఫెమస్ అయ్యారు. అందులో కొంతమంది ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అలా మన ముందుకు వచ్చిన మరో నటి సార్య లక్ష్మణ్(Saarya laxman).
కరోనా టైంలో చాలా మంది లాగే సార్య కూడా జస్ట్ టైంపాస్ కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలు పెట్టారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ఆమె చేసిన రీల్స్ చాలా మందికి నచ్చడంతో.. కవర్ సాంగ్స్ ఆఫర్స్ రావడం మొదలైంది. ఈక్రమంలోనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో నచ్చినావురో(Nachhinavuro) అనే ఫోక్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఈ సాంగ్ భారీగా హిట్ అవడంతో.. సోషల్ మీడియాలో ఫుల్ ఫెమస్ అయ్యారు సార్య.
నచ్చినావురో సాంగ్ సూపర్ సక్సెస్ కావడంతో సార్యకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. రీసెంట్ గా సార్య మేమ్ ఫెమస్(Mem femous) సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగమ్మాయిలు కనిపించడం లేదు అనే సమయంలో సార్య లాంటి వారు హీరోయిన్ రావడం మంచి పరిణామం అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.