కామన్వెల్త్ గేమ్స్ శిక్షణా శిబిరంలో కొవిడ్ కలకలం..

కామన్వెల్త్ గేమ్స్ శిక్షణా శిబిరంలో కొవిడ్ కలకలం..

కామన్వెల్త్ గేమ్స్ 2022 శిక్షణా శిబిరంలో కరోనా కలకలం రేగింది. క్యాంపులో పాల్గొంటున్న భారత మెన్స్ హాకీ టీమ్ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు ఆటగాళ్లతో పాటు..ముగ్గురు సపోర్ట్ స్టాఫ్కు కరోనా సోకినట్లు హాకీ ఇండియా ప్రకటించింది.  

జులై 28 నుంచి ఆగస్టు 8వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి.  ఈ గేమ్స్కు  ఎంపికైన భారత హామీ పురుషుల జట్టు శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. అయితే జట్టులోని స్ట్రైకర్  గుర్జంత్ సింగ్, ప్రధాన కోచ్ గ్రాహం రీడ్తో సహా ఐదుగురికి జ్వరం రావడంతో వీరితో పాటు అందరికి టెస్టులు నిర్వహించారు. అయితే మిగతా వారికి నెగిటీవ్ రాగా..స్ట్రైకర్  గుర్జంత్ సింగ్, ప్రధాన కోచ్ గ్రాహం రీడ్తో సహా ఐదుగురికి పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారందరిని ఐసోలేషన్కు తరలించారు.

కామన్వెల్త్ గేమ్స్ 2022 శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న హాకీ మెన్స్ టీమ్ జట్టు సభ్యులకు కొవిడ్ సోకినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. అయితే ఎవరెవరికి కొవిడ్ సోకిందన్న  విషయాన్ని  మాత్రం వెల్లడించలేదు. 

ప్రస్తుతం పీఆర్ శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్, పవన్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార, అమిత్ రోహిదాస్ సహా 31 మంది ఆటగాళ్లు  సాయ్ క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్నారు.