గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మించిన డ్రామా, ట్విస్టులు

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మించిన డ్రామా, ట్విస్టులు
  • మహా పాలిటిక్స్‌పై ఇంటర్నెట్‌లో పేలుతున్న సెటైర్లు

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరగడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మించిన నాటకీయత ఉందంటూ ట్విట్టర్లో మెమ్స్ చేస్తున్నారు. చెత్త రాజకీయాలంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. బెస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ అని కామెంట్లు చేస్తున్నారు.

మలుపు ఇవీ…

ఎన్నికల ముందు బీజేపీ-శివసేన కలిసి పోటీ చేశాయి. ఫలితాల తర్వాత సీఎం పదవి సహా కేబినెట్‌లోనూ 50:50 ఫార్మాలా శివసేన పట్టుబట్టింది. ఆ పార్టీకి సీఎం కుర్చీ ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ.. దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారని వేరే ఆప్షన్‌కు ఒప్పుకునేది లేదని చెప్పింది. కేంద్రంలో ఎన్డీఏ నుంచి శివసేన బయటకు వచ్చేసి బీజేపీతో పాతికేళ్ల బంధాన్ని తెంచుకుంది.

RELATED NEWS: 

‘మహా’ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

రాష్ట్రంపై బీజేపీది సర్జికల్ స్ట్రైక్..ఎన్సీపీ కలిసే ప్రసక్తే లేదు

ప్రమాణ స్వీకారం సంగతి మాకు తెలియదు: ఎన్సీపీ ఎమ్మెల్యేలు

పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్ ఇచ్చినా మా వల్ల కాదని చేతులెత్తేసింది ఆ పార్టీ. ఆ వెంటనే ఎన్సీపీ, శివసేనలనూ పిలిచిన గవర్నర్. కాంగ్రస్‌తో కలిసి ఆ రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం. మద్దతు లేఖలు తెచ్చుకునే అడిగిన టైం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన.

అయినా బలం ఉంటే గవర్నర్ దగ్గరకు వెళ్లొచ్చంటూ అమిత్ షా వ్యాఖ్యలు. ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు.. సమావేశాలు.. అంతలోనే ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ.. రాష్ట్రపతి పదవి ఆఫర్ అంటూ ఊహాగానాలు. ఎన్సీపీ-బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ ప్రచారం. వాటన్నింటినీ ఖండించిన పవార్.

ఆ తర్వాతి రోజే (శుక్రవారం రాత్రి) ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన మూడు పార్టీల ఉమ్మడి భేటీ.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఏకాభిప్రాయం. తెల్లవారి గవర్నర్‌ను కలుస్తామన్న శరద్ పవార్. రాత్రికి రాత్రే ట్విస్ట్ ఇచ్చిన శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకే అంటూ తెల్లవారుతూనే 5.47 గంటలకు రాజ్‌భవన్‌లో ఎంట్రీ.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం.

ఇన్ని మలుపు, ట్విస్టులు ఏ సినిమాలోనూ ఉండవంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆన్‌లైన్ యాక్షన్ గేమ్‌తో పోలిక పెట్టి ట్వీట్లు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్‌ వీడియో గేమ్‌లోనూ ఈ రేంజ్ ట్విస్టులు ఉండవని, ఎండింగ్ అంతుచిక్కడం లేదని కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ గేమ్ క్రియేటర్స్ ముంబైకి వెళ్తున్నారు అని సెటైర్లు వేశారు. కొందరైతే ఇండియా పాలిటిక్స్‌ను చెత్తతో పోలుస్తున్నారు.

సెటైరికల్ మెమ్స్‌లో కొన్ని..