మేము కాప్ లం ట్రైలర్ రిలీజ్...

మేము కాప్ లం ట్రైలర్ రిలీజ్...

నాగబాబు కొణిదెల, గెటప్ శ్రీను,  రవితేజ న‌‌న్నిమల‌‌ లీడ్ రోల్స్‌‌లో విక‌‌ట‌‌క‌‌వి ఫేమ్ ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్  ‘మేము కాప్‌‌లం’.  మే 22 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఊరిపెద్ద గజపతిరాజు (నాగబాబు)కు చెందిన సలార్ రాజు అనే కోడి పుంజు కనిపించకుండా పోతుంది. దాన్ని వెతకడానికి పోలీస్‌‌ ఆఫీసర్స్‌‌గా గెటప్ శీను,  రవితేజ న‌‌న్నిమల‌‌ రంగంలోకి దిగుతారు. 

వచ్చే కోడి పందేలలో పోటీకి దిగాల్సిన ఆ కోడి కనిపించకపోవడం వల్ల ఎవరికి లాభం అనే కోణంలో దర్యాప్తు చేస్తుంటారు.  మరోవైపు ఆ ఊర్లో మరో సమస్య ఎదురవుతుంది. ఇంతకూ కోడి దొరికిందా, ఆ కొత్త సమస్యను ఎలా పరిష్కరించారు.. ఈ దర్యాప్తులో బయటపడ్డ నిజాలేమిటి  అన్నది మిగతా కథ. బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి  శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. గ్రామాల్లోని రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు నేపథ్యంలో కామెడీ, మిస్టరీ కలయికగా దీన్ని రూపొందించినట్టు మేకర్స్‌‌ తెలియజేశారు.