అంటాల్యా (టర్కీ): తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన ఇండియా మెన్స్ రికర్వ్ ఆర్చరీ టీమ్ ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో నిరాశపరిచింది. టాప్ సీడింగ్‌తో ఎలిమినేషన్ రౌండ్‌కు క్వాలిఫై అయిన జట్టు క్వార్టర్ ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టింది.
శనివారం జరిగిన క్వార్టర్స్‌లో రెండో ర్యాంకర్ ఇండియా 4–5 (26–26*)తో షూటాఫ్‌లో మెక్సికో చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీలో టాప్–3 ప్లేస్ సాధించిన జట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్తులు లభిస్తాయి. విమెన్స్ టీమ్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓడింది. ఇరు జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ర్యాంక్‌లపై ఆధారపడనున్నాయి.