ఉదయం పూట కాస్త గట్టిగానే తినాలి.. లేదంటే

ఉదయం పూట కాస్త గట్టిగానే తినాలి.. లేదంటే

పెద్దలే కాదు పిల్లలు కూడా ఉదయం పూట కాస్త గట్టిగానే తినాలి. లేదంటే  మానసిక సమస్యలు తప్పవు అంటోంది జర్నల్​ ఫ్రోటియర్స్​ ఇన్​ న్యూట్రిషియన్​ స్టడీ. ఈ స్టడీ ప్రకారం టైంకి బ్రేక్​ఫాస్ట్​ తినని పిల్లల్లో యాంగ్జైటీ, మూడ్​ స్వింగ్స్​ ఎక్కువగా ఉన్నాయి.

టైంకి బ్రేక్​ఫాస్ట్​ తినకపోయినా,  బ్రేక్​ఫాస్ట్​లో సరిపడా పోషకాలు అందకపోయినా.. పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపై ఈ స్టడీ చేశారు. ఈ రీసెర్చ్​లో పాల్గొన్న లోపేజ్​ గిల్​.. 2017 లో స్పానిష్​ నేషనల్​ హెల్త్​ సర్వేని ఆధారంగా చేసుకోని ఈ స్టడీ చేశారు. నాలుగు నుంచి పద్నాలుగేండ్ల మధ్య వయసున్న పిల్లలపై జరిగిన ఈ స్టడీలో బ్రేక్​ఫాస్ట్​ సరిగా తినని పిల్లల్లో మూడ్​స్వింగ్స్, యాంగ్జైటీ సమస్యలు ఉన్నట్లు తేలింది.

బయట బ్రేక్​ ఫాస్ట్​ తినే పిల్లలో ఈ సమస్య ఇంకాస్త  ఎక్కువే ఉన్నట్టు చెప్తున్నారు రీసెర్చర్​లు. దానికి  కారణం బయటి ఫుడ్​లో సరిపడా పోషకాలు లేకపోవడమే. అలాగే  బ్రేక్​ఫాస్ట్​లో కాఫీ, టీ, పాలు, చాక్లెట్, కోకోవా, పెరుగు​, బ్రెడ్, టోస్ట్​, సిరియల్స్.. పేస్ట్రీస్​ తిన్న పిల్లలో ఈ  బిహేవియరల్​ ప్రాబ్లమ్స్​ తక్కువగా ఉన్నాయని చెప్తోంది ఈ రీసెర్చ్​.