ప్రతీ ఉద్యోగికి విరమణ సహజం : డీఈవో శ్రీనివాస్ రెడ్డి

ప్రతీ ఉద్యోగికి  విరమణ సహజం : డీఈవో శ్రీనివాస్ రెడ్డి

చేర్యాల, వెలుగు: ప్రతి ఉద్యోగికి విరమణ సహజమని, ఎంఈఓ కిష్టయ్య చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర విద్య పరిశీలన మండలి డైరెక్టర్ గాజర్ల రమేశ్,  డీఈవో శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. 

గురువారం చేర్యాల ఎంఈఓ కిష్టయ్య -భాగ్యలక్ష్మి ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభ గురువారం మండల కేంద్రంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించిన కిష్టయ్య ఉన్నత చదువులు చదివి హెచ్ఎంగా, ఎంఈఓగా పనిచేసే విద్యారంగ బలోపేతానికి కృషి చేశారన్నారు. 

విద్యా సంవత్సరం ముందస్తుగానే బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించారని తెలిపారు. అనంతరం ఎంఈఓ రచ్చ కిష్టయ్యను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సిద్దిపేట జిల్లా సెక్టోరియల్ అధికారి రమేశ్, భాస్కర్, విద్యాశాఖ అధికారులు, టీచర్లు పాల్గొన్నారు.