జనం పొదుపుతో మా అమ్మకాలు తగ్గాయి : మెర్సిడెస్‌‌​ బెంజ్

జనం పొదుపుతో మా అమ్మకాలు తగ్గాయి : మెర్సిడెస్‌‌​ బెంజ్

న్యూఢిల్లీ: జనం పొదుపును మరింత పెంచడం వల్ల తమ అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయని యూరప్​ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్‌‌​ బెంజ్​ సేల్స్​ అండ్​ మార్కెటింగ్​ హెడ్​ సంతోష్​ అయ్యర్​అన్నారు. జనం విపరీతంగా సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​(సిప్​) ద్వారా కొంచెం కొంచెం మొత్తాలను మ్యూచువల్​ ఫండ్లలో పెడుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బిలియనీర్లు ఉన్న దేశాల్లో ఇండియా మూడోస్థానంలో ఉన్నప్పటికీ లగ్జరీ కార్ల అమ్మకాలు ఇక్కడ తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. “ ఈక్విటీ/మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లు మా పోటీదారులు. మీరు సిప్​ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సైకిల్​ను ఆపగలిగితే మన గ్రోత్​ను పెంచుకోవచ్చని నేను నా టీమ్​కు చెప్తున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ అన్నారు.  స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ యాప్​ల వల్ల ఆర్థిక విషయాలపై అవగాహన పెరగడంతో చాలా మంది ఈక్విటీ మార్కెట్లవైపు వచ్చారు. క్యాపిటల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో బుల్ రన్ కారణంగా వేలాది మంది డీమ్యాట్​ ఖాతాలు తెరిచారు. ముఖ్యంగా కరోనా తరువాత జనం పొదుపును పెంచారు.  

సిప్​ల ద్వారా వచ్చిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోలు ఈ ఏడాది మే నుండి రూ. 12,000 కోట్ల మార్కును తాకాయి. వీటి విలువ  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో రూ. 13,040 కోట్లకు చేరుకుంది. మెర్సిడెస్- బెంజ్ ఇండియా కొత్త వెహికల్​ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అధిక డిమాండ్​ కారణంగా భారీగానే అమ్మకాలను సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్​లో అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసింది. విదేశాల మాదిరిగా కాకుండా, ఇండియాలో బలహీనమైన సామాజిక భద్రతా చర్యల కారణంగా పొదుపు ఎక్కువగా చేస్తారని, తమ పిల్లలకూ పొదుపును నేర్పిస్తారని అయ్యర్ వివరించారు. "మన దగ్గర పొదుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం గరిష్టంగా ఎంత వీలైతే అంతా ఆదా చేస్తాం.  కాస్త ఎక్కువ జీతం ఉన్న కస్టమర్ సిప్​లో పెట్టే పెట్టుబడి  రూ. 50 వేల వరకు ఉండొచ్చు. ఈ మొత్తాన్ని మనం లగ్జరీ కార్ మార్కెట్ వైపు మళ్లిస్తే వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ”అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి, ఆర్థిక  మాంద్యం ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ పైకి వెళ్తోంది. ఈ ఏడాది జనవరి–-జూన్ మధ్య దేశంలో దాదాపు 17,000 లగ్జరీ వెహికల్స్​ అమ్ముడయ్యాయని ఆటో పరిశ్రమ అంచనా వేసింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో విక్రయించిన 11,000 యూనిట్ల కంటే 55% ఎక్కువ.

అధిక పన్నులతో ఇబ్బందులు 

భారత మార్కెట్లో ఆటోమొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధిక పన్నులు విధించడం వల్ల సూపర్, లగ్జరీ కార్ల విక్రయాలు పరిమితంగా ఉంటుంన్నాయని మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆటోమొబిలి లంబోర్ఘిని గ్లోబల్ సీఈఓ స్టీఫన్ వింకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాన్ అన్నారు.  అయితే, ఈ సమస్య లగ్జరీ కార్ల పరిశ్రమ మాత్రమే ఎదుర్కొనేది కాదని, దేశంలోని మొత్తం ఆటోమొబైల్ మార్కెట్ వృద్ధిని అడ్డుకుంటోందని చెప్పారు. “ఇది లగ్జరీ కార్ల సమస్య మాత్రమే కాదు. చిన్న కార్ల కంపెనీలూ ఎక్కువ పన్నుల వల్ల ఇబ్బందిపడుతున్నాయి. మొత్తం జన సంఖ్యతో భారతదేశంలో అమ్మే కార్ల సంఖ్యతో పోల్చండి.  మీరు దీన్ని ఇతర దేశాలతో పోల్చినట్లయితే తేడా స్పష్టంగా తెలుస్తుంది. యూఎస్‌‌, చైనా లేదా యూరప్‌‌ వంటి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పోల్చినప్పుడు, ఇండియా కార్ల మార్కెట్ ఎంతో చిన్నది.   ఆయా దేశాలతో పోలిస్తే మనవద్ద లగ్జరీ కార్ల అమ్మకాలు తక్కువగా ఉన్నాయి ”అని ఆయన చెప్పారు.