
హైదరాబాద్,వెలుగు: సిటీలో వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఐటీ ప్రొఫెషనల్స్టార్గెట్గా వాట్సప్గ్రూప్లింక్స్ పంపించి బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ పేరిటి ఇన్వెస్ట్ చేయించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ కోట్లలో దోచేస్తున్నారు. వర్చువల్ అకౌంట్స్‌తో మాయ చేస్తూ రూ.లక్షల్లో ఇన్వెస్ట్ చేయించి, ఆపై యాప్స్ డిలీట్ చేస్తున్నారు. ఇలా మోసగాళ్ల చేతుల్లో చిక్కిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.ఈ ఏడాది 3 నెల్లలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు 12 కంప్లయింట్వచ్చాయి. మొత్తం కేసుల్లో రూ.2.5 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.
బిట్ కాయిన్‌కు విలువ పెరిగిపోతుండగా..
బిట్ కాయిన్ యాప్స్ ఆన్‌లైన్ లింక్స్‌తో డెవలప్ చేసిన వర్చువల్ కరెన్సీ. ఫారిన్ ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, డిజిటల్ కరెన్సీలో జరుగుతుంటాయి. డాలర్స్‌తో బిట్ కాయిన్స్ కనెక్ట్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగింది. దీంతో బిట్ కాయిన్స్ విలువ పెరిగిపోతుండగా ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మందిలో ఆసక్తి పెరిగింది. ఎక్కువగా లెక్కలు లేని డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. బ్లాక్ మనీతో పాటు ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా ఉండేందుకు బిట్ కాయిన్స్ కొనుగోలు చేస్తుంటారు. బిట్ కాయిన్ సేల్ చేసే వ్యక్తులు, కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు రహస్యంగా ఉంటాయి.
గ్రేటర్‌లోనే బాధితులు ఎక్కువ
ఆన్‌లైన్ అడ్డాగా నడుస్తోన్న బిట్‌కాయిన్ దందాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సుమారు రూ.5 నుంచి రూ.10 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారు. గ్రేటర్ సిటీలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. చైనా గేమింగ్ యాప్స్, లోన్ యాప్స్ కేసుల్లో ఎక్కువగా బిట్ కాయిన్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్జరిగాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తారు. వందల సంఖ్యలో నకిలీ యాప్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తారు. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో లింక్‌లు పంపుతారు. వాటిని ఓపెన్ చేసిన వారిని టార్గెట్ చేస్తారు. బిట్ కాయిన్ కొనుగోలు చేసిన రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని నమ్మిస్తారు. యాప్స్‌లో ఇంట్రెస్ట్ చూపిన వారిని ఇన్వెస్ట్ చేసేలా టార్గెట్ చేస్తారు.
గ్రూప్‌లో చాటింగ్ చేస్తూ..
వాట్సాప్‌లో లింక్స్ పంపించి ముందుగా ఓపెన్ చేయిస్తారు. అప్పటికే గ్రూపులోని మెంబర్స్‌తో చాటింగ్ లో ఉంటారు. క్రియేట్ చేసిన బిట్‌కాయిన్ వెబ్‌సైట్‌లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. ఇన్వెస్ట్ చేసినట్లు ఫేక్ ఆన్‌లైన్ పేమెంట్స్ స్క్రీన్ షార్ట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్‌మెంట్‌కి రెండు మూడు రోజుల్లోనే సుమారు 10 శాతం లాభాలు వచ్చినట్లు చెప్తుంటారు. ఇన్వెస్ట్ చేసిన డబ్బును వర్చువల్ అకౌంట్స్‌లో బ్యాలెన్స్ చూపిస్తుంటారు. ఇన్వెస్ట్ మెంట్ చేసిన డబ్బు,లాభాలు విత్ డ్రా చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతుంటారు. కస్టమర్ల అకౌంట్‌లో ఎప్పటికప్పుడు ఇన్‌కం చూపిస్తుంటారు. ఇలా రూ.50 వేల నుంచి రూ.కోట్లలో ఇన్వెస్ట్ చేయించి కొట్టేస్తారు.
నకిలీ యాప్స్ ఎక్కువ ..
డిజిటల్ మార్కెట్‌లో బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు పెరిగాయి. ఇలాంటి యాప్స్‌లో నకిలీవే ఎక్కువ. ఫోన్లకు వచ్చే ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఆన్‌లైన్‌లో కూడా బిట్ కాయిన్స్ సైట్స్ క్లిక్ చేయొద్దు. ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపుల్లో పోస్టింగ్స్ వస్తున్నాయి. మెయిల్స్‌పై పాప్ అప్స్ కూడా వస్తుంటాయి.అలర్ట్‌గా లేకపోతే మోసపోతారు.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్