మహారాష్ట్రలో పోలీసు అధికారి అత్యాచారం చేశాడని చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని లేడీ డాక్టర్ చనిపోయిన ఘటన మరువక ముందే.. ఢిల్లీలో మరో మహిళా డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం సంచలనంగా మారింది. ఎన్నాళ్ల నుంచి ఆమెపై కన్నేశాడో గానీ.. ఒక పెద్ద మాయోపాయం పన్ని ఆమెకు దగ్గరయ్యాడు దుర్మార్గుడు. నమ్మి నట్టింట్లోకి రానిస్తే.. చివరికి విష సర్పంలా కాటేసిన ఘటన వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఒక డెలివరీ బాయ్ మాటలు నమ్మి మోసపోయిన డాక్టర్.. ఆర్మీ ఆఫీసర్ పేరుతో రేప్ చేశాడని చెప్పడం షాకింగ్ కు గురిచేసింది. ఢిల్లీలోని సఫ్తర్జంగ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్ లైంగిక దాడికి గురైనట్లు పోలీసులను ఆశ్రయించింది. ఒక డెలివరీ బాయ్ తనను రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఆర్మీ ఆఫీసర్ నని.. లెఫ్ట్ నెంట్ గా పరిచయం పెంచుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఢిల్లీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఆరవ్ అనే వ్యక్తి.. డాక్టర్ కు ఇన్ స్టా లో పరిచయం అయ్యాడు. తను ఆర్మీ లెఫ్ట్ నెంట్ అని చెప్పడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుని రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటూ వస్తున్నారు. ఆర్మీ యూనిఫాల్ లో ఫోటోలు దిగి డాక్టర్ పంపిస్తూ నమ్మించాడని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ నెల ప్రారంభంలో ఆరవ్ ఢిల్లీకి వెళ్లిన ఆరవ్.. మస్జిద్ మాత్ ప్రాంతంలోని ఆ డాక్టర్ ఇంటికి వెళ్లి కలిశాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఆహారంలో మత్తుమందు కలిపి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. డాక్టర్ స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అఘాయిత్యం జరిగిందని తెలిసి షాక్ కు గురైంది. అక్టోబర్ 16న సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డాక్టర్ ఫిర్యాదు మేరకు చత్తర్‌పూర్‌లోని అనేక ప్రాంతాల్లో వెతికి చివరికి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
విచారణ సందర్భంగా ఆరవ్ చెప్పిన విషయాలు విన పోలీసులు షాక్ కు గురయ్యారు. లేడీ డాక్టర్ పై మనసు పడిన ఆరవ్.. ఆమెను మోసం చేయడానికి ఆర్మీ యూనిఫాం కొన్నట్లు వెల్లడించాడు. ప్లాన్ ప్రకారం పరిచయం పెంచుకుని దగ్గరైనట్లు చెప్పాడు. ఒకరోజు ఇంటికెల్లి.. ఫుడ్ లో మత్తు మందు కలిపి రేప్ చేసినట్లు అంగీకరించాడు.
మహారాష్ట్రలో కూడా సేమ్ ఇలాంటి కేసు:
గత కొన్ని రోజుల్లో ఒక డాక్టర్లపై జరిగిన లైంగిక వేధింపుల కేసుల్లో ఇది రెండో కేసు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో, జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా డాక్టర్.. పోలీసు అధికారి వేధిస్తున్నారని.. నాలుగు సార్లు అత్యాచారం చేశాడని చేతిపై సూసైడ్ నోట్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఫల్తాన్ సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న యువ డాక్టర్ సంపద ముండే బుధవారం (అక్టోబర్ 23) రాత్రి ఫల్తాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఒక పోలీస్ అధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ సంఘటన మెడికల్ కమ్యూనిటీలో ,రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
సూసైడ్ నోట్ లో ఏముంది?..
సంపద ముండే చేతిపై రాసుకున్న నోట్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (PSI) గోపాల్ భాద్నే తనను మానసికంగా, శారీరక వేధింపులకు గురిచేశాడని..అతను ఆమెను 5 నెలల్లో 4 సార్లు బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
అలాగే మరొక పోలీస్ అధికారి ప్రశాంత్ బంకార్ మానసికంగా ఒత్తిడికి గురి చేశాడని నోట్ లో రాసింది. సంపద ముండే ఆరోపణలు పోలీసులను తీరుకు అద్దం పడుతున్నాయని.. నిందితులపై చర్యలకు వైద్యసంఘాలు డిమాండ్ చేశాయి.
