ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకులున్నారా..? గొంతు మార్చి పెళ్లి చేసుకుంటానంటే రూ.8 లక్షలు సమర్పించేశాడు !

ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకులున్నారా..? గొంతు మార్చి పెళ్లి చేసుకుంటానంటే  రూ.8 లక్షలు సమర్పించేశాడు !

ఆవలిస్తే పేగులు లెక్కబెడతారు.. నువ్వేంట్రా బాబు ఈ రోజుల్లో ఇంత అమాయకంగా ఉన్నావు..? అనే మాటలు అక్కడక్కడా వినిపిస్తుంటాయి. కానీ వాటిని నిజం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా యువకుడు అమాయకంగా మోసపోయాడు. అమ్మాయిలా స్వరం మార్చి.. పెళ్లి చేసుకుంటానంటే ఎనిమిది లక్షల రూపాయలు సమర్పించేసుకున్నాడు. 

ఆదిలాబాద్ జిల్లాలో స్వరం మార్చి యువనికి  వలపు  వల విసిరారు ముగ్గురు  మోసగాళ్లు. క్రుష్ణవేణి గా పరిచయం చేసుకుని.. యువకుడిని ఫోన్ లో లవ్ లో దింపాడు మాంజీ అనే ఒక కేటుగాడు. మాజీకి తోడుగా మరో ఇద్దరు యువకులు వీళ్ల లవ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు నటించి నమ్మించారు. ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని బాధితుడు  లక్ష్మీ కాంత్  నుంచి రూ.8లక్షలు వసూలు చేశారు ముగ్గురు యవకులు. 

ఆ తర్వాత ఫోన్ ఎత్తకపోవడం.. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెప్పడంతో.. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు లక్ష్మీకాంత్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసగాళ్లను ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను  సూర్యాపేట జిల్లా  రామచంద్రపూర్ తండాకు చెందిన వారిగా గుర్తించారు. 

ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వమించిన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి.. వివరాలు వెల్లడించారు.  సూర్యాపేటలో‌ నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుంచి లక్షన్నర నగదు, ‌మూడు  సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.