మాల్స్ కు పబ్లిక్ వస్తలేరంటున్న వ్యాపారులు

మాల్స్ కు పబ్లిక్ వస్తలేరంటున్న వ్యాపారులు

హైదరాబాద్ జనానికి కాస్త ఫ్రీ టైం దొరికినా… వర్క్ లోడ్ పెరిగినా ముందు గుర్తుకు వచ్చే ప్లేసెస్ మాల్స్. వీక్ డేస్ తో పాటు వీకెండ్ లోనూ ఎప్పుడూ ఇవి రద్దీగా  ఉంటాయి. విందు, వినోదం అందించే మాల్స్ ని కరోనా వల్ల నాలుగు నెలలు పూర్తిగా మూసేశారు. అన్ లాక్ నిబంధనలతో ఇప్పుడే ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. గతంలో రోజూ ఒక్కో మాల్ కి ఐదు వేల మంది వచ్చే వాళ్లు. ఇప్పుడు అందులో సగం మందే వస్తున్నారని చెబుతున్నారు నిర్వాహకులు. కరోనా నిబంధనల పాటిస్తూ రోజూ ఐదు సార్లు మాల్ ను శానిటైజ్ చేస్తున్నట్టు చెప్పారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు లోపలికి అనుమతిలేదంటున్నారు. మాల్ కు వచ్చే వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే లోపలికి పంపడం లేదని చెబుతున్నారు.

మాల్స్ కు వచ్చే వారిలో సగం మంది విండో షాపింగ్ చేసే వారే. మరి కొందరు బ్రాండెడ్  వస్తువులను కొనడానికి వచ్చేవారు. అయితే మాల్స్ లోని బ్రాండెడ్ షో రూమ్స్ గిరాకీ లేక  బోసిపోతున్నాయి. దీంతో వచ్చే వారిని అట్రాక్ట్ చేయడానికి ఫ్లాట్  50,  స్పెషల్, ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కస్టమర్స్ క్లాత్స్ ను ట్రయల్ చేసి కొనుగోలు చేయకపోతే వాటిని 24 గంటల పాటు వేరే రూమ్ లో పెట్టి స్టెమ్మింగ్ చేస్తున్నారు… చాలా చోట్ల N-95 మాస్క్ లను  అనుమతించడం లేదు..

మాల్స్ లో క్లోతింగ్ సెక్షన్, ఫుట్ వేర్, గాడ్జెట్స్  తో పాటు ఫుడ్ కోర్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి.  మొన్నటి వరకు  రోడ్ సైడ్ ఫుడ్ ను ప్రిఫర్ చేయని సిటీ పబ్లిక్… ఇపుడు నార్మల్ లైఫ్ కు వస్తున్నారు.  ఫ్రాంచైజ్ తో పాటు టెక్ బేస్డ్ ఫుడ్ కోర్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి… పిజ్జా హట్ డొమైన్ తో పాటు కొన్ని హోటల్స్  తెరుచుకున్నా.. మరి కొన్ని ఇంకా మూసే ఉన్నాయి. స్టాఫ్ సమస్య ఎక్కువగా ఉందనీ… వ్యాపారం మళ్లీ పుంజుకోవడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు ఓనర్స్.

మాల్స్ ఎక్కువగా  ఐటీ సెక్టార్ ఉన్న ఏరియాల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా ఇంటికే పరిమితం కావడం, పిల్లలకు ఆన్ లైన్ క్లాసెస్ జరుగుతుండటంతో మాల్స్ కు యూత్ రావడం లేదు. మాల్స్ లోని  సినిమా హాల్స్ , గేమింగ్ జోన్ లకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో వ్యాపారంపై ప్రభావం పడిందంటున్నారు మాల్స్ నిర్వాహకులు. కరోనా ప్రభావం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం..  విండో షాపింగ్ పై ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నారు. ఎప్పుడూ కలర్ ఫుల్ గా కనిపించే మాల్స్ లో ప్రస్తుతం రష్ తగ్గినా….. రాబోయే రోజుల్లో మళ్ళీ జోరందుకుంటుందని భావిస్తున్నారు నిర్వాహకులు.