- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ.వెంకట్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారు యూటీఎఫ్ ఆఫీసులో తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) క్యాలెండర్ ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. కొండయ్య, సిల్వేరు మహేశ్ తోల కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మోడల్ స్కూల్స్ ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేసి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. టీజీటీలకు, జూలై 2013లో జాయినైన పీజీటీలకు నోషనల్ సర్వీస్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
