మెస్సీసేన విజయంతో ఉప్పొంగిన అభిమానలోకం

మెస్సీసేన విజయంతో ఉప్పొంగిన అభిమానలోకం
  • ప్రపంచ వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
  • రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మెస్సీ

డేనియెల్‌‌‌‌‌‌‌‌ పాసరెల్లా, డీగో మారడోనా. లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీ. అర్జెంటీనా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్లు. పాసరెల్లా 1978లో, మారడోనా 1986లో దేశానికి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ అందించి తమ కెరీర్‌‌‌‌‌‌‌‌ను పరిపూర్ణం చేసుకున్నారు. ఇప్పుడు మెస్సీ కూడా  వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్పును ముద్దాడి వారి సరసన నిలిచాడు. టాలెంట్‌‌‌‌‌‌‌‌లో దివంగత మారడోనా స్థాయిని ఏనాడో అందుకున్న మెస్సీ మరెన్నో ఘనతలు సాధించాడు.  రెండు దశాబ్దాల కెరీర్‌‌‌‌‌‌‌‌ లో  37 క్లబ్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలు, ఏడు బాలన్‌‌‌‌‌‌‌‌ డిఓర్‌‌‌‌‌‌‌‌ అవార్డులు, ఆరు యూరోపియన్‌‌‌‌‌‌‌‌ గోల్డెన్‌‌‌‌‌‌‌‌ బూట్స్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నాడు.   కోపా అమెరికా కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు.  ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ కూడా మెడలో వేసుకున్నాడు. కానీ, అతని కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఏకైక లోటు ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. 16 ఏండ్ల నుంచి నాలుగు ఎడిషన్లలో ఎంత ప్రయత్నించినా నెరవేరని అతని కల ఖతార్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం రాత్రి సాకారం కావడంతో మెస్సీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మెస్మరైజ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

మారడోనా నీడను దాటొచ్చి..    

అర్జెంటీనా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పేరు చెప్పగానే మారడోనా, మెస్సీనే గుర్తొస్తారు. ఇద్దరి మధ్య పోలిక వస్తే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన మారడోనానే బెస్ట్‌‌‌‌‌‌‌‌ అంటారు. క్లబ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌ సాధించినప్పటికీ.. లియోనల్‌‌‌‌‌‌‌‌ను ఇన్నాళ్లు మారడోనా  నీడనే వెంటాడింది. ఎట్టకేలకు మారడోనా నీడను దాటొచ్చిన మెస్సీ ఈ టోర్నీలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన తీరు అమోఘం. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత  మెస్సీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ కల కలగానే మిగిలిపోతుందని చాలా మంది జోస్యం చెప్పారు. కానీ, ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోని మెస్సీ తోటి ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా అద్భుతంగా ఆడుతూ వాళ్లను ప్రోత్సహించాడు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన మెస్సీ మరో మూడు గోల్స్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు.  క్లిష్టమైన నాకౌట్‌‌‌‌‌‌‌‌ దశలో ప్రతీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్కోరు చేసి ఇతర ప్లేయర్లకు ఉదాహరణగా నిలిచాడు. మెస్సీ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌కు  ఎంజో ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌, జులియన్‌‌‌‌‌‌‌‌ అల్వారెజ్‌‌‌‌‌‌‌‌, డి మరియా, మరీ ముఖ్యంగా కీపర్‌‌‌‌‌‌‌‌ మార్టినేజ్‌‌‌‌‌‌‌‌ సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ కూడా తోడవడంతో అర్జెంటీనా 36 ఏండ్ల తర్వాత మరో కప్పు అందుకుంది.

గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌

మెస్సీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ విక్టరీ తర్వాత సాకర్‌‌‌‌‌‌‌‌ గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఎవరన్న చర్చకు పుల్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ పడినట్టు అనిపిస్తోంది. ప్రస్తుత తరంలో మెస్సీకి  పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డో నుంచి గట్టి పోటీ ఉంది. కానీ, రొనాల్డో  ప్రపంచ కప్‌‌‌‌‌‌‌‌ లేకుండానే కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిస్తున్నాడు.  వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన  గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ పీలే, మారడోనా కంటే  మెస్సీ చాలా ఎక్కువే సాధించాడు. పీలే మూడు వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్స్​ అందుకోవడం అసాధారణ విషయమే అయినా క్లబ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో మెస్సీని  తను ఏమాత్రం  మ్యాచ్​ చేయలేడు. బార్సిలోనా తరఫున మెస్సీ యూరోపియన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌లో మకుటం లేని మహారాజుగా వెలుగొందాడు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ పోటీ ఉండే చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో నాలుగు టైటిల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం అతని సత్తాకు నిదర్శనం. మారడోనా ఓ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నా.. బార్సిలోనా, నపోలి క్లబ్స్‌‌‌‌‌‌‌‌కు ఆడి ఒక్కసారి కూడా యూరోపియన్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గలేకపోయాడు. ఈ లెక్కన  ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ సామ్రాజ్యంలో మెస్సీ గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు. 

ఆకాశమే హద్దుగా..

అర్జెంటీనా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ విక్టరీతో ఆ దేశంతో పాటు వరల్డ్​ వైడ్​ సెలబ్రేషన్‌‌‌‌‌‌‌‌ మిన్నంటాయి.  ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ అంటే పడిచచ్చే అర్జెంటీనా ప్రజలు బ్యూనస్ ఎయిర్స్ లోని ఒబెలిస్క్ వద్దకు వచ్చారు. సుమారు 20 లక్షల మంది  సంబరాలు చేసుకున్నారు. మెస్సీ హోమ్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ రొసారియోలోనూ లక్షలాది ప్రజలు ఒక్కచోటకు వచ్చారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అర్జెంటీనాలో పలు నగరాల్లో  పెద్ద బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ మెస్సీ పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌, ఫొటోలతో కనిపించాయి. 

ఇండియాలోనూ..

ఇండియాలో సాకర్‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా ఇష్టపడే కేరళ, బెంగాల్‌‌‌‌‌‌‌‌, గోవాలోనూ ఫ్యాన్స్ పటాకులు కాలుస్తూ, డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ అర్జెంటీనా విజయాన్ని సెలబ్రేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. కోల్‌‌‌‌‌‌‌‌కతా, కొచ్చి, తిరువనంతపురం, పనాజి, ఇంఫాల్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు నగరాల్లో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఆదివారం అర్ధరాత్రి, సోమవారం  వీధుల్లోకి వచ్చి సందడి చేశారు.

గూగుల్‌‌‌‌ రికార్డూ బద్దలు

అర్జెంటీనా, ఫ్రాన్స్‌‌ ఫైనల్‌‌ గూగుల్‌‌లోనూ రికార్డు సృష్టించింది. గూగుల్​లో గత 25 ఏండ్లలో మరే అంశం కోసం వెతకనంతగా.. ప్రజలు ఫైనల్ మ్యాచ్ కోసం సెర్చ్ చేశారు. ‘అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్’ అనే సెర్చ్ టర్మ్ తో  ఆదివారం కోటి మందికి పైగా సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్ (ఇండియా) డేటా వెల్లడించింది. ఇక ఫైనల్‌‌ మ్యాచ్‌‌కు జియో టీవీ ఫ్లాట్‌‌ఫామ్‌‌లో రికార్డు స్థాయిలో 3.2 కోట్ల వ్యూస్‌‌ లభించాయి.

మెస్సీ పర్సనల్​ అవార్డులు

    బాలన్‌‌‌‌‌‌‌‌ డిఓర్‌‌‌‌‌‌‌‌– 7 రికార్డు (2009 నుంచి 2012, 2019, 2022)
    వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ గోల్డెన్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌– 2 (2014, 2022)
    ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌–1 (2009)
    ఫిఫా బెస్ట్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌–1 (2019)
    యూరోపియన్‌‌‌‌‌‌‌‌ గోల్డెన్‌‌‌‌‌‌‌‌ షూ –6 
(2009–10 నుంచి 2012-–13, 20116–17 నుంచి 2018–19)
    లారెస్‌‌‌‌‌‌‌‌  వరల్డ్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ 
అవార్డు–1 (2020)