సెప్టెంబర్ నుంచి రోజూ ఆఫీసులకు రండి : ఐటీ కంపెనీ వార్నింగ్

సెప్టెంబర్ నుంచి రోజూ ఆఫీసులకు రండి : ఐటీ కంపెనీ వార్నింగ్

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని అయిన మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది.  సెప్టెంబర్ నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. 

మెటా కొత్త వర్క్ పాలసీ..

మరోవైపు మెటా సంస్థ తమ ఉద్యోగులకు కొత్త వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులైనా కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.  వర్క్ లో సమర్థత, ఉత్పాదకత వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మెటా..సెప్టెంబర్ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే రిమోట్ వర్క్ కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచి విధులు నిర్వర్థించేందుక మెటా అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. 2023 మార్చిలో మెటా సీఈవో జుకర్ బర్గ్ తో జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడు మెరుగైన పనితీరు కనబరుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెటా కొత్త వర్క్ పాలసీని అమలు చేయనున్నట్లు సమాచారం. 

ఉద్యోగుల తొలగింపు..

మెటా కంపెనీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముగిసింది. 2022 సెప్టెంబర్ లో 11 వేల మందికి ఉద్వాసన పలికిన మెటా..ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌, కంటెంట్‌ స్ట్రాటజీ, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తీసేసింది.