META : చాట్జీపీటీ తరహా సేవలు అందించనున్న మెటా

 META : చాట్జీపీటీ తరహా సేవలు అందించనున్న మెటా

టెక్నాలజీ దిగ్గజం మేటా కూడా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రేసును మొదలుపెట్టింది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో చాటా జీపీటీ తరహా సేవలు అందించేందుకు సిద్ధం అవుతుంది. దీనికోసం మెటా ఉన్నత స్థాయి ప్రొడక్ట్ గ్రూప్ ను నియమించుకుంది. దానికి మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ నేతృత్వం వహిస్తున్నాడు. ప్రజలకు అన్ని రకాల అవసరాలను తీర్చే విధంగా ఈ ఏఐని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం టెక్స్ట్, వీడియో, ఇమేజెస్ లు ఏఐ మోడల్ లో అభివృద్ధి చేస్తున్నారు. చాట్ జీపీటీ లాంటి సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్నాప్ చాట్ కూడా ఏఐ బాట్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.