Meta Layoffs: అప్పుడు రిక్రూట్..ఇప్పుడు తొలగింపు.. మెటా AI విభాగం నుంచి వందలాది ఉద్యోగులు ఔట్

Meta Layoffs: అప్పుడు రిక్రూట్..ఇప్పుడు తొలగింపు.. మెటా AI విభాగం నుంచి వందలాది ఉద్యోగులు ఔట్

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్​ కంపెనీ మెటా మరోసారి లేఆఫ్స్​ ప్రకటించింది. AI సూపర్​ ఇంటెలిజెన్స్​ విభాగం నుంచి ఉద్యోగులను తొలగిస్తుంది. మెటా సీఈవో మార్క్​ జుకర్​ బర్గ్​ తన AI సూపర్​ ఇంటెలిజెన్స్​ప్రాజెక్టుకోసం బెస్ట్ టీం ను ఏర్పాటు చేసుకున్న కొన్ని నెలలకే అదే టీం సభ్యులను తొలగించేందుకు సిద్దమయింది. మెటా AI  డివిజన్​ నుంచి దాదాపు 600 మంది ఉద్యోగులను  తొలగిస్తూ ఇంటర్నల్​ మెమోలు పంపించినట్లు తెలుస్తోంది.

మార్క్​ జుకెర్ బర్గ్​ తన  మెటాAI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కోసం గత కొన్నినెలల క్రితం బిలియన్​ డాలర్లు ఖర్చు చేసి స్కిల్డ్​ టీం ను రిక్రూట్​ చేసుకున్నారు. దీంతో ఆపిల్​, ఓపెన్​ ఏఐ, ఆంత్రోపిక వంటి రైవల్​ కంపెనీలకు ధీటుగా స్కిల్డ్​ఎంప్లాయీస్​ ను సంపాదించుకున్నారు. అయితే ఇది జరిగిన కొన్ని నెలలకే AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ దాదాపు 600 మంది ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్దమైంది. 

ఉద్యోగుల కోతలపై స్పందించిన మెటా చీప్​ AI ఆఫీసర్​ అలెగ్జాండర్​ వాంగ్..  కంపెనీ సామర్థ్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తగ్గించడం లక్ష్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మెటా కొత్తగా ఏర్పడిన TBD ల్యాబ్​ లో అత్యధిక జీతాలతో కీలకమైన AI పొజిషన్లలో ఉద్యోగ నియామకాలు చేయనున్నట్లు తెలిపారు. మెటాలోని ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు అప్లయ్​ చేసుకోవాలని కంపెనీ ప్రకటించింది. 

మెటా AI ఆశయాలకు అనుగుణంగా మార్క్​ జుకెర్ బర్గ్​ భారీగా పెట్టబడులు పెట్టారు. తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్​ ఏర్పాటుకు వాంగ్ నేతృత్వంలోని డేటా లేబులింగ్ స్టార్టప్ అయిన స్కేల్ AIలో రూ.1.2 లక్షల కోట్లు ($14.3 బిలియన్లు) పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. రైవల్స్​నుంచి AI స్కిల్డ్ ఉద్యోగులను ఆకర్షించేందుకు మెటా రూ.800 కోట్ల ($100 మిలియన్లు) వరకు ప్యాకేజీలను అందించిందని కూడా నివేదికలుచెబుతున్నాయి.  ప్రస్తుతం లేఆఫ్స్​ కంపెనీ పునర్నిర్మాణ చర్యే కానీ.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ పై వెనక్కి తగ్గడం కాదు అని మెటా ప్రకటించింది.