
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే 11వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చిన కంపెనీ తాజాగా మరికొందరిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో మార్క్ జూకర్ బర్డ్ మేనేజర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే మేనేజర్ల లేఆఫ్ లు తప్పకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మెటాలో పనిచేసే ఉద్యోగుల్ని మేనేజ్ చేసేందుకు మేనేజర్లు, వాళ్లని నియంత్రించేందుకు మరికొందరు మేనేజర్లు, వారిని మేనేజ్ చేసేందుకు ఇంకొందరు మేనేజర్లు ఉన్నారు. ఇంతమంది మేనేజర్లు అవసరమని నేను అనుకోవడం లేదు’ అని జూకర్ కామెంట్ చేశాడు. ఈ మాటలతో మిడిల్ లెవల్ మేనేజర్లపై వేటు పడే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.