జుకర్బెర్గ్కు ఒక్క రోజులో రూ.25 వేల కోట్ల నష్టం

జుకర్బెర్గ్కు ఒక్క రోజులో రూ.25 వేల కోట్ల నష్టం

భారత్ తో పాటు అనేక దేశాల్లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్స, మెసెంజర్ నిలిచిపోయవడంతో మెటా కు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచ వ్యాప్తంగా మెటా ఫ్లాగ్ షిప్ ప్లాట్ పారమ్ లు అయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల అంతరాయం  ఏర్పడంతో CEO మార్క్ జుకర్ బర్గ్ ఒక్క రోజులో దాదాపు 3 బిలియన్ లు అంటే  సుమారు రూ.24,741కోట్లు ) నష్టాన్ని చవిచూశారు. ఈ ఫ్లాట్ ఫారమ్ లు యాక్సెస్ చేయలేకపోతున్నాం.. లాగ అవుట్ అవుతున్నామని యూజర్లు చాలామంది X లో తెలిపారు. మీమ్స్, జోక్ లతో బిలియన్ల కొద్ది యూజర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. 

ఒక్క రోజులో మార్క్ జుకర్ బర్గ్ నికర విలువ 2.79 బిలియన్ డాలర్లు తగ్గి బ్లూమ్ బెర్ బిలియనీర్స్ ఇండెక్స్ లో 176బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్షీణత ఉనప్పటికీ జుకర్ బర్గ్.. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా, థ్రెడ్స్ లలో అంతరాయం తర్వాత మెటా షేర్లలో 1.6 శాతం తగ్గడంతో నికర విలువలో కోతపడింది. వాల్  స్ట్రీట్ లో ఓవర నైట్ ట్రేడింగ్ సెషన్ లో మెటా షేర్ల ముగింపు ధర ఒక్కొక్కటి 490.22 డాలర్లు గా ఉంది. 

మంగళవారం  రాత్రి 8.30 నుంచి ఈ సాంకేతిక సమస్య ఏర్పడి 2 గంటల పాటు కొనసాగింది. ఈ విషయం మెటా ప్రత్యర్థి ఫ్లాట్ ఫారమ్ అయిన X లో  విమర్శలు, మీమ్స్, జోక్ లు ఓ రేంజ్ లో పేలాయి. అయితే వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి పరిస్థితిని సమీక్షించి ఎటువంటి సైబర్ అటాక్స్ లేవని తెలిపింది.