వాట్సాప్లో అవతార్ ఫీచర్ తీసుకొచ్చిన మెటా

వాట్సాప్లో అవతార్ ఫీచర్ తీసుకొచ్చిన మెటా

మెటా సంస్థ వాట్సాప్లో లేటెస్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. కొంతకాలంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం టెస్ట్ చేస్తున్న వాట్సాప్ మెటా అవతార్స్ ఫీచర్స్ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. బిట్మోజీ, స్నాప్ చాట్ క్యారెక్టర్స్లాగ వాట్సప్ యూజర్లు ఈ మెటా అవతార్స్ వాడుకోవచ్చు. 

వాట్సప్ కోసం మెటా 36 కస్టమైజ్డ్ స్టిక్కర్ ప్యాక్ లాంఛ్ చేసింది. చాటింగ్లో స్టిక్కర్స్లా, ప్రొఫైల్ ఫొటోలుగా కూడా మెటా అవతార్స్ వాడుకోవచ్చు. ఇది వరకు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేస్తే బ్లాంక్గా కనిపించేది. ఇకపై ప్రొఫైల్ పిక్చర్ బ్లాంక్గా కాకుండా ఈ మెటా అవతార్లు కనిపిస్తాయి.