
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండుగంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్, నిజామబాద్ , సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రానున్న నాలుగు గంటల్లో రాష్ట్రంలోవర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.