
- శ్రీజకు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్
సూర్యాపేట, వెలుగు: పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేట సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్ ప్రకాశ్ రెడ్డి, ప్రిన్సిపాల్ మురళి తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జి.శ్రీజ ఎంపీసీ, ఎంబైపీసీలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంక్ తెచ్చుకుందన్నారు. బి. ప్రణవి ఎంపీసీలో 9, ఎంబైపీసీ లో 32, సాయి సృజన ఎంపీసీలో 17, ఎంబైపీసీలో 9, ప్రజ్ఞారెడ్డి ఎంపీసీలో 19, ఎంబైపీసీలో 20 వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. న్యూ విజన్ స్కూల్ విద్యార్థి యస్మిన్ ఎంపీసీలో 34, ఎంబైపీసీలో 46 వ ర్యాంకు సాధించాడని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
న్యూస్ స్కూల్ విద్యార్థినికి 51వ ర్యాంక్
నల్గొండ అర్బన్, వెలుగు: పాలిసెట్ ఫలితాల్లో నల్గొండ యాట కన్నారెడ్డి కాలనీలోని న్యూస్ స్కూల్ విద్యార్థిని జి.వాగ్దేవి రాష్ట్రస్థాయిలో 51వ ర్యాంక్ సాధించినట్లు చైర్మన్ గంట్ల అనంతరెడ్డి తెలిపారు. శనివారం పాఠశాలలో ఆమెను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గంట్ల పద్మ, ప్రిన్సిపాల్ అలుగుబెల్లి తిరుమలరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.