పాలిసెట్ ఫలితాల్లో  ‘త్రివేణి’ ప్రభంజనం

పాలిసెట్ ఫలితాల్లో  ‘త్రివేణి’ ప్రభంజనం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : 2025 పాలిసెట్ ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ​ర్యాంకులు సాధించారని త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి శనివారం తెలిపారు. మంగళవారం విడుదలైన 2025 తెలంగాణ పాలిసెట్​ ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన త్రివేణి పాఠశాల విద్యార్థులు స్టేట్​ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు. వీరిలో సరయు రాష్ట్రస్థాయిలో187వ ర్యాంక్, ప్రణవి 339, వెంకట వర్షిత్ 481, చరిత 529, శాహిస్త 1340​, మాన్హైత 1357,  హమ్సికా 1823వ ర్యాంక్​ సాధించారన్నారు.

ఈ ఫలితాలలో 100 పైన మార్కులు సాధించిన విద్యార్థులు నలుగురు, 90 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 8 మంది, 5000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో అత్యున్నత ఫలితాలను సాధించగలిగెలా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పాఠశాల సీఆర్ వో కాట్రగడ్డ మురళీకృష్ణ, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ముస్తఫా, అశోక్, క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.