
కేయూ క్యాంపస్, వెలుగు: ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికుల కుటుంబాల సహాయార్థం అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకుట్) ఒక రోజు బేసిక్ పేని అందిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొ.బి.వెంకట్రామిరెడ్డి, ఎల్పీ.రాజ్ కుమార్ తెలిపారు. అకుట్ నిర్ణయం మేరకు ఒకరోజు జీతాన్ని సైనిక కుటుంబాల సహాయార్థం అందించాల్సిందిగా శనివారం కేయూ వీసీ.ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి సమక్షంలో వీసీ ప్రొ.వి.రామచంద్రంకు లెటర్ అందించారు.
మొత్తంగా రూ.3.14 లక్షలు కాగా, మే నెల జీతంలో ఆ అమౌంట్ను హైదరాబాద్సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ కు అందించనున్నట్లు అకుట్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.