యాదగిరిగుట్ట ఏసీపీగా శ్రీనివాస్​

యాదగిరిగుట్ట ఏసీపీగా శ్రీనివాస్​

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట పోలీస్​స్టేషన్​లో ఏసీపీగా శ్రీనివాస్ నాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జోన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో గంజాయి కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో యువతకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక నిఘా వ్యవస్థతో గంజాయి సరఫరాను శాశ్వతంగా నిర్మూలించడానికి కృషి చేస్తామన్నారు. గతంలో యాదగిరిగుట్టలో ఎస్సైగా, సీఐగా పని చేయడంతో.. ఈ ఏరియాపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.