హైదరాబాద్ లో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్ లో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్, వెలుగు:  సిటీలో బుధవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది.  రాత్రి 10 గంటలకు మొదలైన వాన తెల్లవారుజాము వరకు కురిసింది. వరుస వానలకు  రెండ్రోజులుగా కొన్ని సెల్లార్లలో నీరు తొలగడం లేదు. గురువారం చిరుజల్లులు మినహా పెద్దగా వర్షం ఎక్కడా కురవలేదు.

మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.