- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. శనివారానికి నిజా మాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. మిగతా రోజులకు రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. హైదరాబాద్ లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. కాగా.. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.