
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో వాన తగ్గట్లేదు. శనివారం ఉదయం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ముసురు పడింది. ఆ తరువాత గ్యాప్ ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా షేక్ పేటలో 1.90, బంజారాహిల్స్లో 1.70, శివరాంపల్లి, ఫిల్మ్నగర్లో 1.63 సెంటిమీటర్ల వాన పడింది. శనివారం ఐటీ ఉద్యోగులకు హాలిడే కావడంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడలేదు. ఆదివారం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
మరోవైపు హుస్సేన్ సాగర్ కు వరద పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు అధికారులు బయటికి పంపుతున్నారు. వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. శనివారం సాయంత్రానికి నీటిమట్టం 513.25 మీటర్లకు చేరింది. 792 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 92 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.