కస్టమర్లకు ఇవ్వాల్సిన మీటర్లు.. విద్యుత్ కాంట్రాక్టర్​ ఇంట్లో..

కస్టమర్లకు ఇవ్వాల్సిన మీటర్లు.. విద్యుత్ కాంట్రాక్టర్​ ఇంట్లో..

గచ్చిబౌలి, వెలుగు: కస్టమర్ల ఇండ్లలో ఫిట్ చేయాల్సిన 42 విద్యుత్ మీటర్లను ఓ కాంట్రాక్టర్ అక్రమంగా తన ఇంట్లో నిల్వ చేశాడు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు మీటర్లను స్వాధీనం చేసుకుని, కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంబాగ్ డివిజన్ కు చెందిన కొందరు  తమ ఇండ్లకు విద్యుత్​మీటర్లకు అప్లయ్ ​చేసుకున్నారు. రోజులు గడుస్తున్నా ​మీటర్లు రాకపోవడంతో ఇబ్రహీంబాగ్ ఏడీఈ దృష్టికి తీసుకువెళ్లారు.   

విచారణ చేపట్టగా ఇబ్రహీంబాగ్ ​డివిజన్​లో దాదాపు 42 మీటర్లను  ​కాంట్రాక్టర్​ చెన్నకేశవరెడ్డి తీసుకున్నట్లు తేలింది. దీంతో ఇబ్రహీంబాగ్​ఏడీ అంబేద్కర్ ​రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలికాంనగర్​లోని చెన్నకేశవరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా మీటర్లు కనిపించలేదు. సీసీ ఫుటేజీలు చెక్​చేయగా, ఓ ఆటోలో  మీటర్లను తరలించి చిత్రపురికాలనీలోని ఓ ఇంట్లో  మీటర్లు స్టోర్​ చేసినట్లు గుర్తించారు. 42 మీటర్లును స్వాధీనం చేసుకున్నారు. 

కాంట్రాక్టర్​ చెన్నకేశవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఇన్​స్పెక్టర్ తెలిపారు. మీటర్లను వినియోగదారులకు సప్లై చేయకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేయడంపై ఆరా తీస్తున్నారు.