హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మెట్రో 800 వ స్టోర్

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మెట్రో 800 వ స్టోర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫుట్‌‌‌‌‌‌‌‌ వేర్ రిటైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్రో బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో తమ 800 వ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్ చేసింది. ఈ కొత్త ఫిట్‌‌‌‌‌‌‌‌ఫ్లాప్‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మొత్తం 716  చదరపు అడుగుల్లో  విస్తరించి ఉంది.  2024–2025 నాటికి  మరో 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 స్టోర్లను ఓపెన్ చేస్తామని   మెట్రో బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిస్సాన్‌‌‌‌‌‌‌‌ జోసెఫ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. 

కంపెనీ కేవలం ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కూడా విస్తరిస్తోందని చెప్పారు.  కస్టమర్లు ఇంటి దగ్గర నుంచే  ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాక్సెసరీల షాపింగ్ చేసుకోవచ్చన్నారు. మెట్రో షూస్‌‌‌‌‌‌‌‌ నుంచి  ఫిట్‌‌‌‌‌‌‌‌ఫ్లాప్‌‌‌‌‌‌‌‌, ఫిలా వంటి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందిన బ్రాండ్లు తమ స్టోర్లలో దొరుకుతాయన్నారు.