సమ్మర్లో ట్యాంకర్ల సేవలు భేష్..నిర్వాహకులతో ఎండీ అశోక్రెడ్డి భేటీ

సమ్మర్లో ట్యాంకర్ల సేవలు భేష్..నిర్వాహకులతో ఎండీ అశోక్రెడ్డి భేటీ

హైదరాబాద్​సిటీ,వెలుగు: గత వేసవిలో గ్రేటర్​ పరిధిలో నీటి సమస్యల పరిష్కారంలో ట్యాంకర్ల సేవలను మెట్రోవాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అభినందించారు. సోమవారం వాటర్​ట్యాంకర్ల ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవిలో మెట్రోకస్టమర్​ సర్వీస్​(ఎంసీసీ) ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఉచిత ట్యాంకర్ల సరఫరాలోనూ ట్యాంకర్ల నిర్వాహకులు బాగా పని చేశారన్నారు. బల్దియాతోపాటు ఓఆర్ఆర్​పరిధిలో నిరంతర నీటి సరఫరాను అందించడంలో ఆపరేటర్లు పనితీరు బాగుందన్నారు. 

మిగితా రోజుల్లో ఆపరేటర్లకు కనీస వ్యాపార మద్దతు లభించడం లేదని వారు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన మేరకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎండీ హామీ ఇచ్చారు. బోర్డు ఈడీ మయాంక్​మిట్టల్, హెచ్​ఎండబ్ల్యూఎస్​ఎస్బీ వాటర్​ట్యాంకర్​ఓనర్స్​అసోసియేషన్​ అధ్యక్షుడు అక్బర్​హుస్సేన్​తో పాటు ట్యాంకర్ల ఆపరేటర్లు పాల్గొన్నారు.